తుంగతుర్తి చుట్టూ తిరుగుతున్న ఉమ్మడి జిల్లా రాజకీయం

తుంగతుర్తి చుట్టూ తిరుగుతున్న ఉమ్మడి జిల్లా రాజకీయం
  • ఇరువురు జిల్లా అగ్రనేతల ఆదిపత్య పోరులో అభ్యర్థి ఎవరవుతారు?
  • టికెట్ స్థానికులకు లేక స్థానికేతరులకా?
  • టికెట్ ఇస్తే చేరడానికి సిద్ధంగా ఉన్న మరో మాజీ మంత్రి?
  • ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేసుకున్న అధికార పార్టీ అభ్యర్థి

తుంగతుర్తి ముద్ర:-ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయం తుంగతుర్తి నియోజకవర్గం చుట్టూ తిరుగుతుందా ?తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ ఆశించే వారి సంఖ్య ఉమ్మడి జిల్లాలోనే . ఇంకా టికెట్ ఇస్తే పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్న మరో మాజీ . పార్టీ అభ్యర్థులు ఒకపక్క టికెట్ల కొట్లాటలో ఉండగా అధికార పార్టీ అభ్యర్థి మూడోసారి బరిలోకి దిగనున్న స్థానిక శాసనసభ్యుడు ఇప్పటికే ఒక రౌండ్ ప్రచార పర్వం పూర్తి . అధికార పార్టీకి ధీటుగా ప ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఒక పక్క నాయకత్వ లోపం మరోపక్క టికెట్ల కోసం పోటీ పడుతూనే ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడంతో క్యాడర్ అయోమయంలో పడుతున్నట్లు కనిపిస్తుంది .స్థానికులమైన తమకి టికెట్ ఇవ్వాలని ఇద్దరు ముగ్గురు నేతలు అంటుండగా బలమైన అభ్యర్థులుగా తమను గుర్తించి తమకే  టికెట్ ఇవ్వాలనీ  మరి కొంత మంది ప్రత్యక్షంగా పరోక్షంగా చెబుతున్నారు. స్థానికులు ,స్థానికేతరులు వివాదం ఒకపక్క మరో పక్క ఇద్దరు జిల్లా ఆగ్రనేతుల ఆధిపత్యం మరోపక్క నియోజకవర్గం కాంగ్రెస్ రాజకీయాలను ఉక్కిరిబిక్కి చేస్తున్నాయన్నమాట సర్వత్రా వినవస్తుంది. మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గత ఐదు దశాబ్దాలుగా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు .కాగా గత కొంతకాలంగా తుంగతుర్తిలో ఆధిపత్యం కోసం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అందులో భాగంగానే ఈసారి తన పార్లమెంటు పరిధిలోని తుంగతుర్తి బరిలో తన అనుచరున్ని అభ్యర్థిగా సూచించే విధంగా ప్రయత్నాలు చేస్తుండగా దీన్ని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అంగీకరిస్తారా? అనే మాట వినవస్తుంది. నియోజకవర్గంలో గట్టిపట్టున్న దామోదర్ రెడ్డిని కాదని టికెట్ ఇవ్వకపోవచ్చని  ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు .వీరిరువురిని కాదని ఒకరిద్దరు నేతలు గాంధీభవన్ ఢిల్లీ స్థాయి నేతలతో పైరవీరు సాగిస్తూ టికెట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది .అధిష్టానం ముందు దామోదర్ రెడ్డి ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధిపత్యం నెగ్గుతుందా? లేక వీరి ఇరువురిని పక్కకు పెట్టి వీరికి సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది .ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఒకసారి, రాష్ట్ర ఏర్పాటు అయ్యాక రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గంలో ఓటమిపాలై 15 సంవత్సరాలు అధికారానికి దూరమై  చల్లా చదరవుతున్న కాంగ్రెస్ క్యాడర్ను కాపాడుకోవడానికి ఈసారైనా కలిసికట్టుగా పోటీ చేసి విజయం సాధించడానికి కృషి చేస్తారా? లేక గత రెండు పర్యాయాలు వచ్చిన ఫలితాలు తిరిగి వచ్చేలా ప్రవర్తిస్తారా. అనేది చర్చనీయాంశంగా మారింది .బలమైన ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఎవరో అనేది అధికార పార్టీకి కూడా అవసరమే .బలహీనమైన అభ్యర్థి అయితే సునాయాస విజయం సాధించవచ్చు అని, అభ్యర్థి బలమైన వారైతే ప్రస్తుత తరుణంలో పోటీ తీవ్రంగా ఉంటుందనేదిఅధికార పార్టీ వారి ఆలోచనగా తెలుస్తోంది. ఏది ఏమైనాకాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని సూచించే లోగా అధికార పార్టీ అభ్యర్థి రెండో విడత ప్రచారానికి సమాయత్త మవుతున్నట్లు తెలుస్తోంది .కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అధిష్టానం ప్రకటించి అధికార పార్టీ దూకుడును నిలువరిస్తుందా వేచి చూడాల్సిందే?