శంషాబాద్ విమానాశ్రయం కి బాంబు బెదిరింపు - ఫేక్ మెయిల్ గా గుర్తించిన సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:  శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేయడంతో ఒక్కసారిగా అంత అప్రమత్తం అయ్యారు. సమాచారం అందుకున్నఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అలెర్ట్ అయ్యింది. ఎయిర్‌పోర్టు అంతా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఎయిర్ పోర్టులో బాంబు ఉందంటూ మెయిల్ పెట్టాడు. అప్రమత్తమైన జీఎంఆర్ సెక్యూరిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది.

బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేసిన సీఐఎస్ఎఫ్ అధికారులు, బాంబు బెదిరింపు ఫేక్ మెయిల్ గా గుర్తించిన సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కొని పనిలో పోలీసు బృందం పరిశీలిస్తున్నారు. త్వరలోనే మెయిల్ పంపించిన వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు