రైల్వే సమస్యలను పరిష్కరించండి

రైల్వే సమస్యలను పరిష్కరించండి

రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ కు వినతి పత్రం ఇచ్చిన ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి రైల్వే శాఖ అద్వర్యంలో చేపటాల్సిన పనుల గురించి,  సమస్యలను పరిష్కరించాలని కోరుతు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లు మంగళవారం వినతిపత్రం సమర్పించారు.శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గం   పరిధిలోని పలు రైల్వే సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులను గురించి ఆయనకు వివరించారు.ఈ సందర్బంగా రైల్వే G M అరుణ్‌కుమార్ జైన్ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమములో  కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్ హమీద్ పటేల్  పాల్గొన్నారు.