క్రమశిక్షణ గుర్తింపును ఇస్తుంది- ఎస్పీ

క్రమశిక్షణ గుర్తింపును ఇస్తుంది- ఎస్పీ

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ RSI లకు ప్రొబేషనరీ పరేడ్ టెస్ట్ నిర్వహించిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ ఫోర్స్ నందు పనిచేస్తున్న రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ లకు రెండు సంవత్సరాల సర్వీస్ కాలం పూర్తయి ప్రోబేషనరి పీరియడ్ కు సంబంధించి ఈరోజు జిల్లా పోలీస్ పరేడ్ మైదానం నందు ఎస్పీ రాజేంద్రప్రసాద్  ప్రొబేషనర్ టెస్టును నిర్వహించారు. విధుల నిర్వహణ తోపాటుగా క్రమశిక్షణ చాలా ముఖ్యమని, క్రమశిక్షణతో పనిలో బాధ్యతగా ఉంటే గుర్తింపు లభిస్తుందని ఎస్పీ  ఈ సందర్భంగా తెలియజేసినారు. ఎస్పీ వెంట డిసిఆర్బి డిఎస్పి రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు, శ్రీనివాస్, గోవిందరావు, నరసింహారావు సిబ్బంది ఉన్నారు.