మెదక్ వాసికి అమెరికాలో ప్రతిష్టాత్మక ఆవార్డ్

మెదక్ వాసికి అమెరికాలో ప్రతిష్టాత్మక ఆవార్డ్

ముద్ర ప్రతినిధి, మెదక్: అమెరికాలో ఇంజనీర్ గా పనిచేస్తున్న మెదక్ జిల్లా వాసికకి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామానికి చెందిన వెన్నవెల్లి శరత్ రెడ్డి ఇంజనీరింగ్ పూర్తి చేసి గత పదేళ్లుగా అమెరికాలో నిర్మాణరంగంలో పని చేస్తున్నారు. శరత్ ప్రస్తుతం కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు మేనేజర్ హోదాలో ఉన్నారు. అతను అమెరికాలోని హూస్టన్ తోపాటు అనేక నగరాల్లో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణానికి సారథ్యం వహించారు. కొన్నాళ్ళ క్రితం హూస్టన్ నగరంలో నిర్మించిన మెమోరియల్ పార్క్ కు శరత్ కు నేషనల్ అవార్డు దక్కింది. తాజాగా 2023వ సంవత్సరానికి గాను 'అమెరికా యంగ్ ప్రొఫెషనల్' అవార్డు వరించింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో కన్స్ట్రక్షన్ మెనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా శరత్ కు ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. శరత్ తండ్రి ప్రతాప్ రెడ్డి మెదక్ కోర్టులో సీనియర్ న్యాయవాది కాగా, తల్లి సబిత గృహిణి. శరత్ తాతయ్య విఠల్ రెడ్డి గతంలో రామాయంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర కోళ్లు, మాంసం అభివృద్ధి సంస్థ చైర్మెన్ గా పనిచేశారు. ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ... హూస్టన్ తోపాటు అనేక నగరాల్లో అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించానని చెప్పారు. డ్రైనేజీలు, హైవేలు, పార్కులు, వాటర్, వేస్ట్ వాటర్ ప్రాజెక్టుల నిర్మాణానికి సారథ్యం వహించానని తెలిపారు.