బిఆర్ఎస్ బి-ఫాం అందుకున్న పద్మదేవేందర్ రెడ్డి

బిఆర్ఎస్ బి-ఫాం అందుకున్న పద్మదేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం. పద్మాదేవేందర్ రెడ్డి బి-ఫాం అందుకున్నారు. తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు  కేసీఆర్  చేతుల మీదుగా బీ- ఫాం అందజేశారు. మూడవసారి అవకాశం ఇచ్చిన కెసిఆర్ కు పద్మదేవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కెసిఆర్ పథకాలు, మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లి మెదక్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందుతానని పద్మదేవేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.