కాంగ్రెస్ కటౌట్ల ఏర్పాటుపై మున్సిపల్ కమిషనర్ ఆక్షేపణ పబ్లిక్ ప్లేస్ లో వద్దు,  ప్రైవేటు స్థలాల్లో పెట్టుకోండి

కాంగ్రెస్ కటౌట్ల ఏర్పాటుపై మున్సిపల్ కమిషనర్ ఆక్షేపణ పబ్లిక్ ప్లేస్ లో వద్దు,  ప్రైవేటు స్థలాల్లో పెట్టుకోండి

ముద్ర ప్రతినిధి, మెదక్: ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేడు మెదక్ పట్టణానికి రానుండగా ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసిన కటౌట్లు తొలగించాలని అధికారులు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు జీవన్రావు, సురేందర్ గౌడ్, బొజ్జ పవన్ తిమ్మనగారి అనిల్ తదితరుల పర్యవేక్షణలో పట్టణంలో, రాందాస్ చౌరస్తాలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. సమాచారం తెలుసుకున్న కమిషనర్ జానకిరాం సాగర్, ఇన్స్పెక్టర్ వెంకటేష్ అక్కడికి చేరుకొని ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎలాంటి కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్, టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్ లు అక్కడికి చేరుకొని వెంటనే వీటిని తొలగించాలని పార్టీ నాయకులకు సూచించారు. అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తమ ఓటమిని జీర్ణించుకోలేక,  పార్టీ జాతీయ అధ్యక్షులు రాక సందర్భంగా ఏర్పాటు చేసిన కటౌట్లు  తొలగించేలా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు.