మెదక్ లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు

మెదక్ లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు

ముద్ర ప్రతినిధి, మెదక్:శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మెదక్ పట్టణంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించింది. శనివారం సాయంత్రం మెదక్ పట్టణం పోలీస్ స్టేషన్ నుండి ఈ కవాతు ప్రారంభించారు. మెదక్ డిఎస్పి ఫణీంద్ర,  ఆర్ఏపి డిఎస్పి శశాంక్ శేఖర్ సారద్యంలో టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఎస్ఐ పోచయ్యతోపాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది, టౌన్ పోలీస్ సిబ్బంది కవాతులో పాల్గొన్నారు. మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి పోస్ట్ ఆఫీస్, అంబేద్కర్ సర్కిల్, కొత్త బస్టాండ్, చిల్డ్రన్స్ పార్క్, రాందాస్ చౌరస్తా, పాత బస్టాండ్ రోడ్ నుండి పట్టణ వీధుల్లో కవాతు నిర్వహించారు. శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ జరగకుండా చూడడమే  పౌరులకు సూచించారు.