పాక్షికంగా కూలిన పాత భవనం ... పొంచి ఉన్న ప్రమాదం

పాక్షికంగా కూలిన పాత భవనం ... పొంచి ఉన్న ప్రమాదం

ముద్ర ప్రతినిధి , కోదాడ: కోదాడ పట్టణంలో సోమవారం ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి బొడ్రాయిబజార్ లో ఉన్న పాత భవనం పాక్షికంగా కూలి రోడ్డు పై పడింది . ఆ సమయంలో అక్కడ ఎవ్వరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినది . పాత భవనం మట్టి భవనం అవ్వటం దానిపై చెట్లు పెరగటం అవి విధ్యుత్ తీగలకు తగులుతుండటంతో అనేక సార్లు విద్యుత్ అంతరాయం కలుగుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో వేసవిలో విద్యుత్ సిబ్బంది చెట్లను తొలగించారు . ఈ భవనం పాక్షికంగానే కూలిందని దీనితో ముప్పు పొంచి ఉన్నందున ఈ భవనాన్ని పూర్తిగా కూల్చివేయాలని బొడ్రాయి ప్రాం వాసులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు .