బిఆర్ఎస్ కు బిగ్ షాక్ బిజెపిలో చేరిన సర్పంచ్ నత్తి మల్లేష్, ఎంపిటిసి లావణ్య

బిఆర్ఎస్ కు బిగ్ షాక్ బిజెపిలో చేరిన సర్పంచ్ నత్తి మల్లేష్, ఎంపిటిసి లావణ్య

 తుప్రాన్, ముద్ర: ముఖ్యమంత్రి  కెసిఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వెల్ లో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామ సర్పంచ్, రాష్ట్ర సర్పంచ్ ల ఫోరమ్ ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్, ఎంపీటీసీ నత్తి లావణ్యలు నాయకులు నరేష్ గుప్తా, కుమ్మరి నాగరాజులతో కలిసి శుక్రవారం ఈటెల రాజేందర్ సమక్షంలో బిజెపిలో చేరారు. గత కొంత కాలంగా బిఆర్ఎస్ కు అంటి ముట్టనట్టు ఉంటు బీజేపీలో చేరడం తో బిఆర్ఎస్ పార్టీ కి గట్టి షాక్ తగిలింది. వచ్చే ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గెలుపు కోసం కృషి చేస్తామని వారు తెలిపారు.