ఔను..వాళ్ళిద్దరూ కలిశారు..!

ఔను..వాళ్ళిద్దరూ కలిశారు..!

దసరా శుభాకాంక్షలు తెలుపుకున్న ఎమ్మెల్యే పద్మ, ఎమ్మెల్సీ శేరి

ముద్ర ప్రతినిధి, మెదక్: విజయ దశమి దసరా  పురస్కరించుకొని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి,  ఎమ్మెల్సీ శేరి  సుభాష్ రెడ్డిని  కలిసి ఒకరినొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మంగళవారం శేరి సుభాష్ రెడ్డి స్వగ్రామం హవేలీ ఘన్పూర్  మండలం కుచన్ పల్లిలోని  వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే  వెంట హవేలీ ఘన్పూర్  ఎంపీపీ నారాయణరెడ్డి, మెదక్ పిఎసిఎస్  చైర్మన్ హనుమంత్ రెడ్డి, హవేలిఘన్పూర్, మెదక్ మండలాల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, అంజాగౌడ్, బిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్, నాయకులు గోపాల్ రావు, శేఖర్ రెడ్డి, బయన్న, రేఖమయ్య తదితరులున్నారు.