బాల్య వివాహలపై అవగాహనా

బాల్య వివాహలపై అవగాహనా

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లాలో బాల్య వివాహాలు నిర్మూలన అనే అంశంఫై అవగాహన కార్యక్రమాన్ని ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిదిగా తెలంగాణా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు రాగ జ్యోతి హాజరయ్యారు. బిబిఎ రాష్ట్ర కో ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ హాజరయ్యారు.

బాల్య వివాహం జరిపిస్తే వారిఫై చట్టపరమైన చర్యలు, బాల్య వివాహల నిర్మూలన కొరకు అన్ని శాఖల ఆదికారులు సమన్వయంతో పని చేయాలని రాగ జ్యోతి ఆదేశించారు. మెదక్ జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే ముఖ్య ఉద్దేశంగా పనిచేయాలని అన్ని శాఖల అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీ మహేందర్, జిల్లా విద్యదికారి రాదా కిషన్, జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ, సీడీపీఓలు హేమ భార్గవి, స్వరూప, ఈఓ పద్మ లతా తదితరులు పాల్గొన్నారు.