ఓటేసిన మెదక్ కలెక్టర్ షా.. స్వగ్రామంలో ఓటు వేసిన ఎమ్మెల్యే పద్మ

ఓటేసిన మెదక్ కలెక్టర్ షా.. స్వగ్రామంలో ఓటు వేసిన ఎమ్మెల్యే పద్మ

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ కలెక్టర్ రాజర్షి షా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టర్ నివాసం హవేలీ ఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండా శివారులో ఉంది. ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం 211లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కోనాపూర్ లో పద్మ మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి ఎం. పద్మ దేవేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వగ్రామం రామాయంపేట మండలం కోనాపూర్ లో ఓటు వేశారు.