రెండు ప్రవేటు బస్సులు ఢీ:పలువురికి గాయాలు

రెండు ప్రవేటు బస్సులు ఢీ:పలువురికి గాయాలు

తూప్రాన్ ముద్ర:  పరిశ్రమ కార్మికులను తీసుకుని వెళ్తున్న బస్సును వెనకనుండి వేగంగా వచ్చిన టూరిస్టు బస్సు ఢీకోగా పదిమందికి గాయలైన సంఘటన చేగుంట జాతీయ రహదారి బై పాస్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం చిన్న శంకరంపేట మండలం చందంపేట పరిధిలో గల ఎంఎస్ఎన్ పరిశ్రమకు చెందిన 25 మంది కార్మికులను సిద్దిపేట నుండి ఎక్కించుకుని పరిశ్రమకు వస్తుండగా చేగుంట బైపాస్ వద్ద బస్ మలుపు చుండగా వెనకనుండి టూరిజం బస్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో పది మందికి గాయాలుకాగా వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లొని అస్పత్రికి తరలించారు. టూరిజం బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

డీసీఎంలో చెలరేగిన మంటలు, తప్పిన ప్రమాదం

మక్కల లోడ్ తో వెళుతున్న డీసీఎం వాహనం ఇంజన్ లో ఆకస్మికంగా మంటలు చెలరేగగా ప్రజలు చూసి డ్రైవర్ ను అప్రమత్తం చేసి మంటలు అర్పడంతో  పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే తూప్రాన్ వైపు నుండి టీఎస్ 36టి 3747 నెంబర్ గల డీసీఎం వాహనంలో కామారెడ్డికి మొక్క జొన్నల లోడ్ తో జాతీయ రహదారి గుండా వెళ్తుండగా మండల కేంద్రం మాసాయిపేట గ్రామం వద్దకు రాగానే ఇంజన్ లో  మంటలు చెలరేగాయి. అది గమనించిన ప్రజలు డైవర్ ను అప్రమత్తం చేసి వాహనం నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు. వాహనం ఇంజన్ లో షాక్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు  తెలిపారు. ప్రజలు గమనించి మంటలు అర్పడంతో పెను ప్రమాదం తప్పింది.