బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే పద్మ

బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే పద్మ
  • మహిళలతో కలిసి ఆటపాట

ముద్ర ప్రతినిధి, మెదక్:-మెదక్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఆడిపాడారు. పట్టణంలోని రామాలయంతో పాటు పట్టణంలోని పలువాడల్లో జరిగిన సంబరాల్లో  పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. చిన్నారులతో  ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్బంగా మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.