సిపాయిల సేవలు వెలకట్టలేనివి

సిపాయిల సేవలు వెలకట్టలేనివి
  • కలెక్టర్  రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్:దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులో పనిచేస్తున్న సిపాయిల సేవలు వెలకట్టలేనివని కలెక్టర్  రాజర్షి షా అన్నారు. మంగళవారం   జాతీయ సమైక్యతా దినోత్సవంగా సందర్భంగా  కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ  జాతీయ సమైక్యత, సమగ్రతలను  కాపాడుతూ, దేశ రక్షణ కోసం తమ కుటుంబాలకు దూరంగా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సిపాయిల త్యాగాల ఫలితంగా మనం స్వేచ్చగా జీవించగలుగుతున్నామన్నారు. పబ్లిక్ సర్వీస్ లో ఉన్న మనం  కూడా దేశం కోసం కొంత సమయం వెచ్చించాలని, అవసరమైతే  అదనంగా  పనిచేయాలని కోరారు.  

మన రాజ్యాంగం సమాజంలో 18 ఏళ్ళు నిండిన  అందరికి సమానంగా  ఓటు హక్కు కల్పించిందని, నైతిక బాధ్యతగా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయి పటేల్ దార్శనికత వల్ల లభ్యమైన దేశ ఏకీకరణ, దేశ సమగ్రత, భద్రత, ఐకమత్యానికి అంకితమవుతామని   ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో  డిఆర్ఓ పద్మశ్రీ,  ఎఓ యూనస్, బలరాం, వివిధ కార్యాలయాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.