అధికారంలో ఉన్నప్పుడు షుగర్ ఫ్యాక్టరీలను ఎందుకు తెరవలేదు రాహుల్ గాంధీ చెప్పాలి

అధికారంలో ఉన్నప్పుడు షుగర్ ఫ్యాక్టరీలను ఎందుకు తెరవలేదు రాహుల్ గాంధీ చెప్పాలి
  • ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి,జగిత్యాల:షుగర్ ఫ్యాక్టరీని2004 నుండి 2014 వరకు అధికారంలో ఉండి ఎందుకు తెరిపించలేదో రాహుల్ గాంధీ చెప్తే బాగుండేదని  జగిత్యాల ఎమ్మెల్యే  డా. సంజయ్ కుమార్ అన్నారు. మోతే రోడ్ లోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణంలోని పలువురు మైనారిటీ నాయకులు బి ఆర్ ఎస్ లో చేరగ ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద  నిర్వహించిన రాహుల్ గాంధీ రోడ్ షో అట్టర్ ఫ్లాఫ్ గా నిలిచిందని,జనాలు రారని గ్రహించి ఇరుకైన ప్రాంతంలో ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు . రాహుల్ రోడ్ షోకు  గ్రామాల నుండి పట్టుమని పది మంది కూడా రాలేదని, జగిత్యాల పట్టణం నుండి సైతం ప్రజలు హాజరవ్వలేదన్నారు. రాజకీయ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి అభాసుపాలయ్యారని, మార్గమధ్యంలో నూక పల్లి వద్ద నిర్మించిన పేదోడి ఆత్మగౌరవ ప్రతీక అయిన రెండు పడకల గదులను చూడాల్సి ఉంటే బాగుండేదని అన్నారు.  పసుపు బోర్డుకు సైతం నాడే మద్దతు ధర ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్, మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, ఆమిన్, పారుక్ ,పిన్ను,  కమల్ తదితరులు పాల్గొన్నారు.