వృద్ధుడు భూమికి కబ్జా చేసిన సర్పంచ్...

వృద్ధుడు భూమికి కబ్జా చేసిన సర్పంచ్...
  • పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసిన వృద్ధుడు
  • స్పందిచని అధికారులు ... మెడలో ప్లే కార్డ్ వేసుకొని కలెక్టరేట్ ఎదుట నిరసన

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన ఓ వృద్ధుడి భూమిని సర్పంచ్ సహా నలుగురు ఆక్రమించి ఇబ్బందుల గురిచేస్తున్నారని పలుమార్లు ఫిర్యాదులు చేసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని మెడలో అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని ప్లకార్డు వేసుకొని కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టాడు. వృద్ధుడు తెలిపిన వివరాల ప్రకారం పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన చెవుల మల్లయ్య అనేవృద్ధుడు 40 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన జున్నుతుల చిలకమ్మ వద్ద సర్వే నెంబర్ 397,398 లో 19 గంటల భూమిని కొనుగోలు చేశాడు.

ఇందులో నుంచి తన ఇంటికి వెళ్లడానికి 12 ఫీట్ల వెడల్పు, 75 ఫిట్ల పొడవుతో దారి ఉంది. రెండు నెలల క్రితం గ్రామ సర్పంచ్ గోలి మహేందర్ రెడ్డి, మాద్రి హరి గోపాల్, వరాల సంపత్, తునికిపట్ల శ్రీకాంత్ అనే నలుగురు  జెసిబి తో మల్లయ్యకు చెందిన భూమిని జెసిపితో చదును చేసి వృద్ధుడు ఇంటికి వెళ్లకుండా భూమి ఆక్రమించారు. ఈ విషయమై పలుమార్లు జిల్లా ఎస్పీ, మల్యాల సిఐ, జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో సోమవారం కలెక్టరేట్ కు వచ్చిన మల్లయ్య అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి అంటూ ప్లకార్డు మెడలో పోసుకొని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపాడు. మల్లయ్యను ట్రాఫిక్ ఎస్ఐ ఐ ఎల్ రామ్ కలెక్టరేట్ లోకి తీసుకెళ్లగా ప్రజావాణిలో తన వేదనను విన్నవించి ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదు  స్వీకరించిన ఆర్డీవో మాధురి వృద్ధుని సమస్య పరిష్కరించాలని మల్యాల సిఐకి ఆదేశాలు జారీ చేశారు.