రాజారoలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్

రాజారoలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్


ముద్ర, మల్యాల: జిల్లా ఎస్పీ ఎగ్గాడి భాస్కర్ ఆదేశాల మేరకు మల్యాల మండలం రాజారo గ్రామంలో శనివారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్ఐలు, 50 మంది పోలీసులు గ్రామంలో ఉదయం సోదాలు నిర్వహించారు. అనంతరం డీఎస్పీ ప్రకాష్ మాట్లాడుతూ రాజారo గ్రామంలో క్రైమ్ రేటు ఎక్కువగా ఉందని, ఇకపై ఎవరైనా చట్ట వ్యతిరేకంగా వ్యవహారిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక్కడ ఆరుగురు రౌడీ షీటర్లు ఉన్నారని, ఇకపై తమ ప్రవర్తన మార్చుకోకపోతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు.

ప్రభుత్వం గుడుంబా బ్యాన్ చేసినప్పటికీ, గ్రామంలో ఇంకా తయారు చేయడం ఆపాలని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో నిరక్షరాస్యత కూడా ఎక్కువగా కనిపిస్తుందని, గ్రామస్తులు తమ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించాలన్నారు. ఈ తనిఖీలో కొందరు నాటు తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన బెల్లం పాకం ధ్వంసం చేయడంతో పాటు, పత్రాలు సరిగా లేని 42 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్యాల సీఐ బిల్ల కోటేశ్వర్, ఎస్ఐ తీగల అశోక్ తో పాటు, పలువురు సీఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.