శ్రీ వివేకవర్ధినిలో బోనాల పండుగ

శ్రీ వివేకవర్ధినిలో బోనాల పండుగ

కేసముద్రం, ముద్ర: విద్యార్థుల్లో సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించడానికి ఆషాడ మాసం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం లోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్లో శనివారం బోనాల పండుగ నిర్వహించారు.

అచ్చు గ్రామాల్లో గ్రామదేవతలను పూజించే విధంగా ఆచార వ్యవహారాలను వివరిస్తూ పండుగను నిర్వహించడం విశేషం. పోతురాజుల వేషాలతో డమరుకం మోతలతో, శివసత్తుల పూనకాలతో పాఠశాల మార్మోగిపోయింది. ఉపాధ్యాయులు,విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడంతో పాఠశాల కోలాహలంగా మారింది.