రైతు నాయకుడు కేసీఆర్

రైతు నాయకుడు కేసీఆర్
  • వ్యవసాయం అంటే తెలియని రేవంత్ రెడ్డి.
  • గోరికొత్త పల్లి. మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సత్యవతి రాథోడ్,ఎమ్మెల్యే గండ్ర,

ముద్ర న్యూస్ రేగొండ:-గోరికొత్తపల్లి. మండలం చెన్నపూర్ గ్రామంలో రూ.1 కోటి 66లక్షలతో రామగుండాల పల్లి నుంచి చెంచు పల్లి గ్రామాల మధ్య నూతన బి. టి. రోడ్డు నిర్మాణ పనులకు మరియు రూ.150లక్షలతో నూతన సబ్ స్టేషన్ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్  బండ ప్రకాశ్, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, జిల్లా కలెక్టర్  భావేశ్ మిశ్రా ,జిల్లా SP శ్రీ సురేందర్ రెడ్డి,మహిళలు కొలటాలతో స్వాగతం పలికారు.స్థానికంగా నిర్మాణం అవుతున్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని పరిశీలించారు.ముదిరాజ్ సోదరులు మంత్రి ఎమ్మెల్యే ను ప్రత్యేకంగా సన్మానించారు.

అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో  వారు మాట్లాడాతూ..

సాధించిన తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులకు నిదర్శనమే ఈ కరెంట్ ఉత్సవాలు...ఆంధ్ర నుంచి వేడిపోయిన తెలంగాణ ఎంతో గణనీయంగా పెరిగింది, ఉద్యమ నాయకుడు పాలకుడు అవడంతో అభివృద్ధి అన్ని రకాలుగా ఉంది.గతంలో కరెంట్ ఉంటే వింత,ఇప్పుడు కరెంట్ పోతే వింత...అభివృద్ధి ఎందుకు చేస్తున్నారని అడిగే దీన స్థితిలో ప్రతిపక్ష పార్టీలు..అమెరికా పోయి ఉచిత విద్యుత్ వద్దు,కేవలం మూడు గంటల విద్యుత్ చాలు అంటున్న రేవంత్ రెడ్డి..కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకో నాయకుడు దొరకలేదా...గతంలో కాలిన మోటర్లతో రైతుల చావులను చూసి చలించిన ముఖ్యమంత్రి.గతంలో పరకాలలో సగానికి పైగా మోటార్ వైండింగ్ షాప్ లు ఉండే కానీ ఇప్పుడు కలిపోయే మోటార్లు లేవు, మోటార్ వైండింగ్ షాప్ లు లేవు...

స్థానికంగా నన్ను ఎవరు అడగలేదు...

ఇక్కడ ఒక సబ్ స్టేషన్ పెట్టాలని నిర్ణయించుకుని  చెన్నపూర్, రూపిరెడ్డి పల్లి, చిన్న కోడెపాక, దామరాంచపల్లి గ్రామాలకు అనుసంధానంగా సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.ధరణి వలన రైతులు ఆగం అవుతున్నారని అంటున్న ప్రతిపక్ష పార్టీల నాయకులకు కొంచమైన అవగాహన ఉందా..ఏళ్ల కాలంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిసస్తూ...పట్టాలను అందించి రైతు బంధు, రైతు భీమా అందిస్తున్న కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్న నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలి.ఈ రోజు చిన్న జిల్లాలను ఏర్పాటు చేసుకోవడం వలన  జిల్లాకు ఒక కలెక్టర్ కార్యాలయం, జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మించుకుంటున్నాం.గోరికొత్తపల్లి మండలం దాదాపుగా చాలివాగు ఆధారిత వ్యవసాయం సాగుతుంది.కళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వలన వర్షాలు రాకున్న ఈ రోజు మన చెరువులు,వాగులు ఇంకా నీళ్లతో తొణికిసలాడుతున్నాయి.సమ్మక్క బ్యారేజ్,ఏ. స్ రెస్పీ, చాలివాగు ఇలా నీటిని ఒడిసి పట్టుకుంటు వ్యవసాయానికి నీళ్లు అందిస్తున్న ప్రభుత్వం.

ప్రజలు అందరూ పరిశీలన చేసుకోవాలి...

రైతుల కోసం,ప్రజల కోసం పాటు పడుతున్న  ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకోవాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు.ఎవరు అడగకున్న ప్రజా వాణిజ్య అవసరాలకు అనుగుణంగా నూతన మండలం గోరికొత్తపల్లి ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.ప్రతి పక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇస్తున్న పెన్షన్ ఎంత   500 నుంచి 600 లు మాత్రమే..గతంలో కంటె ఎక్కువ అనే నినాదంతో ముందుకు వస్తున్న పార్టీలకు ప్రజలు మోసపోవద్దు..కేసీఆర్  ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ 100శాతం పూర్తి చేస్తున్నారు.నిత్యం ప్రజా జీవితంలో ఉంటున్న, నెలకు రోజులు క్యాంప్ కార్యలయం వేదికగా కార్యకలాపాలు సాగిస్తున్న.పని చేసేవారు ఎవరో, మాటలు చెప్పే వారు ఎవరో  ప్రజలు విజ్ఞతతో అర్థం చేసుకోవాలి.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మీ,జడ్పీటీసీ సాయిని విజయ,జిల్లా రైతు బంధు కో ఆర్డినేటర్ హింగే మహేందర్, మండల పార్టీ అధ్యక్షుడు మటిక సంతోష్, స్థానిక సర్పంచ్ దేవనూరి ప్రణతి. , ఎంపీటీసీ కవిత, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ రవి సామ్రాట్, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు రహీం పాషా మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు హాజరయ్యారు.