మూడు రోజులుగా కలుషిత నల్లా నీరు

మూడు రోజులుగా కలుషిత నల్లా నీరు

మున్సిపల్  అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అసలే సీజనల్ వ్యాధులతో ప్రజలు అల్లాడుతున్నారు... జలుబు , జ్వరం,  దగ్గు లాంటి వ్యాధుల బారిన పడి పలువురు మంచాలకి పరిమితమయ్యారు.... ఇప్పటికే ప్రభుత్వం తగు సూచనలు పాటించి రక్షణ పొందాలని ప్రజలకు పిలుపునిచ్చింది.  కానీ జగిత్యాల పట్టణంలో ప్రజలు త్రాగే మంచినీరు గత మూడు రోజులుగా మున్సిపల్ నల్లాల ద్వార రంగు మారి కలుషితంగా వస్తుంది. వర్షాకాలంలో వర్షపు నీరు మంచినీటిలో కలిసి ఏ విధంగా రంగు మారుతుందో అల వస్తున్నాయి. త్రాగు నీరు రంగు మారడంపై పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటు సీజనల్ వ్యాధులు అటు కలుషితనీరు ప్రజలను మరింత అనారోగ్యానికి గురి చేస్తున్నాయనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ సరఫరా చేసే  త్రాగునీరు కూడా అరగంటకు మించి రావడం లేదని లైన్ లో ఉంటే చివరి వరకు ఉన్నవారికి నీరు అందడం లేదని వాపోతున్నారు. మున్సిపల్  అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగు నీరు అందించి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని కోరుతున్నారు.