క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి సీఎం కప్ టోర్నీ

క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి సీఎం కప్ టోర్నీ

కేసముద్రం, ముద్ర: గ్రామీణ ప్రాంతాల్లో యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికే రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్ టోర్నీ ఏర్పాటు చేయడం జరిగిందని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఎంపీపీ ఓలం చంద్రమోహన్ అన్నారు. కేసముద్రం, ఇనుగుర్తి సంయుక్త మండలాల పరిధిలోని గ్రామాలకు చెందిన 15 ఏళ్ల పైబడ్డ 36 ఏళ్ల లోపు వారికి క్రీడా పోటీలు కేసముద్రం స్టేషన్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ క్రీడలను జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, సర్పంచ్ బట్టు శ్రీనివాస్ తో కలిసి ఎంపిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ క్రీడా ప్రతిభను చాటి రాష్ట్రస్థాయిలో కేసముద్రం మండలానికి గుర్తింపు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్ పర్సన్ నీలం సుహాసిని దుర్గేష్, కేసముద్రం, ఇనుగుర్తి తహసిల్దార్లు పులి సాంబశివుడు, మహమ్మద్ దిలావర్ ఆబిద్ అలీ, ఎంపీడీవో రవీందర్ రావు, వైస్ ఎంపీపీ రావుల నవీన్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ నజ్జు, హెడ్మాస్టర్ శాంతకుమారి, పిడి నాగయ్య, పి ఈ టి లు రాజేందర్, మధు, లలిత, జ్యోతి, శ్రీనివాస్, రామయ్య, నజీర్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పాల్గొనే క్రీడాకారులకు మూడు రోజులపాటు ఎంపీపీ ఓలం చంద్రమోహన్ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.