సీఈసీలో ట్విన్ సిస్టర్స్ టాప్..!

సీఈసీలో ట్విన్ సిస్టర్స్ టాప్..!

ఇంటర్ ఫలితాల్లో ఇనుగుర్తి గురుకుల విద్యార్థుల ప్రతిభ

కేసముద్రం, ముద్ర: ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోనితెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులై సత్తా చాటారు. ద్వితీయ సంవత్సరం సిఇసి విభాగంలో వి.మాధురి 963/1000, కె.రమ్య -962, హెచ్ఈసి విభాగంలో టి.నవ్య 923, ఎ.భవాని 912, ప్రధమ సంవత్సరం సీఈసీ విభాగంలో ఎం.స్రవంతి 481/500, ఎం.శ్రావణి 462, ప్రధమ సంవత్సరం ఎచ్ఈసీ విభాగంలో పి.అశ్విని 384, వై.రాజేశ్వరి 379 మార్కులతో ఉత్తీర్ణులయ్యారని, 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ విజయ లలిత తెలిపారు. 

సిఈసిలో ట్విన్ సిస్టర్స్ టాప్  ఇనుగుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో ఇంటర్ సిఇసి విభాగంలో ప్రథమ సంవత్సరం చదువుతున్న (కవల పిల్లలు) ట్విన్ సిస్టర్స్ ఎం.స్రవంతి,  481/500, శ్రావణి 462 ప్రధమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణులై ప్రత్యేకతను చాటారు.