శ్రీరామ్ నగర్ మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి కన్నుమూత

శ్రీరామ్ నగర్ మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి కన్నుమూత

మొయినాబాద్: మొయినాబాద్ మండలం శ్రీరామ్ నగర్ మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు హనుమంత్ రెడ్డి గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1980 వ దశకంలో ఆయన శ్రీరామ్ నగర్ సర్పంచ్ గా పని చేశారు. అప్పట్లో యువజన కాంగ్రెస్ లో చురుకైన నాయకుడుగా ఉన్న హనుమంత్ రెడ్డి జిల్లా స్థాయిలో గుర్తింపు పొందారు.  

అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం కలిగిన నేతగా గ్రామాన్ని విశేషంగా అభివృద్ధి పరచడమే కాకుండా మండల, జిల్లా స్థాయిలో కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. చాలాకాలం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం నాడు శ్రీరామ్ నగర్ లో జరిగాయి. చేవెళ్ల శాసనసభ్యుడు కాలె యాదయ్య, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్, కే నరోత్తం రెడ్డి, ఎస్ ప్రభాకర్ రెడ్డి తో పాటు పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు అంత్యక్రియలకు హాజరై ఆయనకు నివాళులర్పించారు.