ఇద్దరు ఉపాధ్యాయులకు ఒక్క రోజు వేతనం కట్..! పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో

ఇద్దరు ఉపాధ్యాయులకు ఒక్క రోజు వేతనం కట్..! పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో

కేసముద్రం, ముద్ర: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సమయానుసారంగా విధులకు హాజరు కాకపోవడం పట్ల మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి పి.రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కేసముద్రం మండలంలోని పలు పాఠశాలలను డీఈవో ఆకస్మిక తనిఖీలు చేశారు. గుడితండా ప్రాథమిక పాఠశాలను ప్రార్ధన సమయంలో సందర్శించగా ఇద్దరు ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో  షోకాజ్ నోటీస్ జారీచేస్తూ, ఇద్దరికి ఒకరోజు వేతనం నిలిపి వేయాలని మండల విద్యాధికారిని ఆదేశించారు. అనంతరం కేసముద్రం విలేజ్ ఉన్నత పాఠశాలలో ఉన్న జిల్లా పాఠ్యపుస్తకాల గోదాంను పరిశీలించి, పంపిణీ ఏర్పాట్లకు సంబంధించిన పలు సూచనలు చేశారు.  పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమం కింద నిర్మిస్తున్న డైనింగ్ హాల్ పరిశీలించి ఎఈ కి, కాంట్రాక్టరుకు పలు సూచనలు చేశారు. కేసముద్రం విలేజ్ ప్రాథమిక, రంగాపురం ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి ఎఫ్.ఎల్.ఎన్. కార్యక్రమం అమలు తీరును పరిశీలించి, ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఈ సందర్శనలో మండల నోడల్ ప్రధానోపాధ్యాయుడు జగన్మోహన్ రెడ్డి, సి.ఆర్.పి. మురళి ఉన్నారు.