పేద ముస్లింలకు యువత చేయూత ఇమ్దాద్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ద్వారా రంజాన్ కిట్ల పంపిణీ

పేద ముస్లింలకు యువత చేయూత ఇమ్దాద్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ద్వారా రంజాన్ కిట్ల పంపిణీ

కేసముద్రం, ముద్ర: నిరుపేద ముస్లిం కుటుంబాలు తమతో పాటు సంతోషంగా రంజాన్ పండుగను జరుపుకునేందుకు ముస్లిం యువకులు పండగ సామాగ్రితో కూడిన కిట్లను అందజేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. ఇమ్దాద్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరవై నిరుపేద ముస్లిం కుటుంబాలకు 45వేల రూపాయల విలువైన రంజాన్ పండుగ సరుకుల కిట్లను, 21 మంది వితంతువులకు చీరలను ఎస్ఐ తిరుపతి చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాలకు‌ డబ్బు, సమయాన్ని కేటాయించాలని సూచించారు.  రంజాన్ పండుగ సాంప్రదాయమైన ‘జకాత్'లో  భాగంగా ముస్లిం యువకులంతా కలిసికట్టుగా ఉండి నిరుపేదలకు సహాయం చేయడం పట్ల అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇమ్దాద్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ బాధ్యులు నవాజ్ అహ్మద్, హాషాం, షబ్బీర్, మున్వర్, నూరొద్దిన్ ఖురేషి, ఖలీల్, అయూబ్ ఖాన్, యూసూఫ్, ఇమ్రాన్, గౌస్, నజీర్, షోయబ్, అజం పాల్గొన్నారు.