రైస్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

రైస్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

కోటి విలువైన బియ్యం, దాన్యం దగ్ధం

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం లోని మహాదేవ రైస్ ఇండస్ట్రీ లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు కోటికి పైగా విలువైన ధాన్యం, బియ్యం కాలి బూడిద అయ్యాయి. శనివారం ఉదయం మిల్లులోంచి పొగలు బయటికి వస్తుండడాన్ని చూసిన కూలీలు వెంటనే మిల్లు యజమానులకు సమాచారం అందజేశారు. వారు వచ్చి చూసేసరికి లోపల అగ్నిప్రమాదం జరిగిందని గమనించి అగ్ని మాపక కేంద్రానికి సమాచారం అందించగా వారు వచ్చేసరికి లోపల సగానికి పైగా ధాన్యం బియ్యం అంటుకున్నాయి. అగ్ని మాపక సిబ్బంది శతవిధాల ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకురావచ్చారు. దీనితో మరోవైపు మిల్లులో నిల్వచేసిన ధాన్యం కొంత అగ్ని ప్రమాదానికి గురికాకుండా కాపాడగలిగారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా గుర్తించారు. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి మిల్లులో నిల్వ చేయడానికి ఇటీవలే పంపింది. దీనికి తోడు గత సీజన్ లో కూడా ధాన్యం బియ్యం పట్టించడానికి ప్రభుత్వం మిల్లుకు కేటాయించింది. పెద్ద ఎత్తున ధాన్యం, బియ్యం మిల్లులో నిల్వ ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో వీళ్ళ బస్తాల్లో ధాన్యం బియ్యం అగ్నికి హాహుతి అయ్యింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  సంఘటన గురించి తెలుసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఘటనస్థలికి చేరుకొని పరిస్థితిని సమక్షించారు.