పంటలకు నష్టపరిహారం చెల్లించాలి

పంటలకు నష్టపరిహారం చెల్లించాలి

కేసముద్రం ముద్ర: అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, తక్షణం పంటలకు నష్టపరిహారం అందించాలని అఖిలభారత రైతుకూలి సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు శివారపు శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మార్చి 16 నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో వ్యవసాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వెంటనే ప్రభుత్వం ఎకరానికి 25 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా పథకాన్ని పంటలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన రైతాంగానికి బ్యాంకు రుణాలను రద్దు చేయాలని, కౌలు రైతులకు పంట నష్ట పరిహారంతో పాటు రైతుబంధు, బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం తహసిల్దార్ సాంబశివుడికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల కార్యదర్శి కొట్టం అంజయ్య, అంబటి నాగమల్లు, వాంకుడోత్ హాతిరాం, బండి రాజు తదితరులు పాల్గొన్నారు.