విద్యార్థులకు వేసవి విద్యాభివృద్ధి శిబిరం

విద్యార్థులకు వేసవి విద్యాభివృద్ధి శిబిరం

కేసముద్రం, ముద్ర: వచ్చే విద్యా సంవత్సరంలో 8, 9, 10 తరగతి చదవబోయే విద్యార్థులకు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు కేసముద్రం స్టేషన్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ప్రత్యేక వేసవికాల విద్యాభివృద్ధి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం వేసవికాలం విద్యా శిబిరాన్ని జిల్లా విద్యాధికారి రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ కరోనా సమయంలో చదువులో వెనుకబడ్డ విద్యార్థుల ఉన్నతి కోసం ఈనెల 31 వరకు ప్రత్యేకంగా ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఆయా తరగతుల విద్యార్థులకు గణితం, ఇంగ్లీష్, సైన్స్ పాఠ్యాంశాలను బోధిస్తారని చెప్పారు. అలాగే ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఆటపాటల్లో కూడా ప్రావీణ్యం పొందడానికి శిక్షణ ఇస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డిఇఓ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసిజి శ్రీరాములు, కోర్స్ డైరెక్టర్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.