రంగోలితో జెపిఎస్ ల నిరసన

రంగోలితో జెపిఎస్ ల నిరసన

కేసముద్రం, ముద్ర: ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించాలని కోరుతూ గత ఏడు రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెలో భాగంగా గురువారం రంగోలితో నిరసన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరం ముందు తాము గ్రామాల్లో ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా నిలుస్తూ అందిస్తున్న సేవలను రంగోలి రూపంలో వేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జెపిఎస్ కేసముద్రం మండల అధ్యక్షుడు సుమంత్ మాట్లాడుతూ తమ ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించి నాలుగున్నర ఏళ్ల తమ సర్వీసును గుర్తించి, వేతన పెంపు, అలవెన్సులు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేపిఎస్ లు అనిల్, జాఫర్, ప్రవీణ్, నరేష్, క్రాంతి, శిరీష, రమ్య, వాణి, మంజుల, అనిత పాల్గొన్నారు.
ఇలా ఉండగా సమ్మెలో పాల్గొన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం పెట్టి, ఆకలి తీర్చి సంఘీభావం తెలిపారు.