మండుటెండలో వీఆర్ఏల నిరసన

మండుటెండలో వీఆర్ఏల నిరసన

కేసముద్రం, ముద్ర: సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర విఅర్ఏ జేఏసి పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం తహసిల్దార్ కార్యాలయం ఎదుట మండుటెండలో వీఆర్ఏలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల జేఏసి చైర్మన్ మాదరపు రమాదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా విఅర్ఏలకు ప్రమోషన్లు, పే స్కేల్ అమలు తోపాటు 55 ఏళ్లు నిండిన విఆర్ఏ ల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి రెండు రెండు సంవత్సరాలు అవుతున్న అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 80 రోజులు సమ్మె చేసి, అసెంబ్లీ ముట్టడిలో భాగంగా మంత్రి కేటిఆర్ చర్చలకు పిలిచి మునుగోడు ఎన్నికల తరువాత పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అలాగే 80 రోజుల సమ్మె కాలానికి జీతం కూడా ఇస్తామని చెప్పినా, ఏ ఒక్క హామీ ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ప్రభుత్వ ఇప్పటికైనా తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ మేరకు రెవిన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు శోభారాణి, విమల, సరిత, ప్రభాకర్, బుచ్చయ్య, మంగిలాల్, యుగేందర్, మహేష్, లచ్చయ్య పాల్గొన్నారు.