ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవారికి  ఇచ్చాం..!

ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవారికి  ఇచ్చాం..!
  • గృహలక్ష్మి నిరుపేద కుటుంబాలకు అందుతుందా....?
  • మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు శ్రీనివాస్ రెడ్డి

ముద్ర, అనంతగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న  సంక్షేమ పథకాలు అనంతగిరి  మండలంలో  అన్ని గ్రామాల  గ్రామసభల  ద్వారా అర్హులైన  పేదలను  పార్టీలకు అతీతంగా  ఎంపిక  చెయ్యకుండా అధికార  పార్టీకి చెందిన  బీసీలకు మాత్రమే బీసీ  బందు  పథకానికి ఎంపిక  చేయడం సరైంది కాదని.. మండల  కాంగ్రెస్ పార్టీ   అధ్యక్షుడు.  ముస్కు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అర్హులైన పేదలను  గుర్తించకుండా తన సొంత  పార్టీ నాయకులకే వర్తింప చేసుకోవడం  మూలాన తన  సొంత పార్టీ నాయకులు  ఏలు పెట్టి చూపించుకునే  విధంగా ఉండడం  మూలాన  ఆ పార్టీ నాయకులు జర్నించుకోలేకపోతున్నారు  అని అన్నారు. బిసి కులాల కులవృత్తిదారులకు వ్యక్తి గత లక్ష రూపాయల  లోనును అర్హులైన పేదలందరికీ  ప్రభుత్వం అందించకపోవడం  దారుణమని వారు అన్నారు.  రాజకీయం జోక్యం లేకుండా  అర్హులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి అందించే వరకు  కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు. అన్ని వర్గాల  ప్రజలకు సంక్షేమ పథకాలు  అందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు .  

కెసిఆర్ గత హామీలన్నీ  మర్చిపోవడానికి  బీసీ బందు. ముస్లింబందు. గృహ లక్ష్మీ పథకం. పెట్టిన స్కీములు  ఎన్నికల జిముక్కులని వారు మండిపడ్డారు. నెలల్లో దిగిపోయే ప్రభుత్వం గృహలక్ష్మి. ఇంటికి మూడు లక్షల  స్కీము ప్రవేశపెడితే  అవి పచ్చి మోసాలని తెలవక  అమాయకంగా ప్రజలు ధ్రువపత్రాల కొరకు ఉరుకులు  పరుగులు పెడుతుంటే కడుపు తర్కపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పదిమంది  అధికార పార్టీ లబ్ధిదారులకిచ్చి  పదివేల మందికి ఇచ్చినట్లుగా భజన చేస్తున్న పత్రికల్లో టీవీలలో అబద్ధాలు ప్రచారం చేసుకోవడం ఘోరమైన అన్యాయం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకమును. దళితులందరికీ మంజూరు చేయాలన్నారు. దళిత బంధు పథకం పేరుకే  తప్ప అమలుకు నోచుకోలేదని హామీగా మాత్రమే మిగిలిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలు ఎలక్షన్ కోడ్ రాబోతుందని  ఎలక్షన్ కోడ్ వచ్చేముందు  గృహలక్ష్మి అని చెప్పి అలాగే  రైతు  రుణమాఫీ అని చెప్పి  కొత్త కొత్త  పథకాలు ఇవ్వబోతున్నట్లు  నాటకాలు ఆడుతున్నారు  అని వారు అన్నారు.  ఎన్నికల కోడ్ వచ్చిన  తర్వాత ఇవ్వలేకపోతున్నామని  మరో మోసానికి  తెర  లేపాలని చూస్తున్నారని వారు విమర్శించారు.