రేషన్ డీలర్ల నియమకంలో అవకతవకలు

రేషన్ డీలర్ల నియమకంలో అవకతవకలు
 ముద్ర చిలుకూరు : ఇటీవల కాలంలో కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా అవసరం ఉన్న గ్రామాలలో కొత్త ప్రభుత్వ రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయుట కొరకు పరీక్షలు నిర్వహించడం జరిగిందని,ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ప్రకటించకుండానే, నేరుగా కొంతమంది వ్యక్తులకు ఇంటర్వ్యూ పేరుతో పర్సనల్గా ఫోన్లు చేసి రేషన్ డీలర్లు నియమించాలనే ఆలోచన చేస్తున్నారని, ఇది అధికార పార్టీ వారి కనుసనల్లో నడుస్తుందని, దీనిని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని రేషన్ డీలర్ల నిమకాన్ని పరీక్షా ఫలితాలు వెల్లడించిన తర్వాత అర్హులైన వారికి, కేటాయించాలని, ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, బహుజన సమాజ్ పార్టీ సూర్యాపేట జిల్లా ఈసీ మెంబర్ కందుకూరు ఉపేందర్, డిమాండ్ చేశారు,