గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలకు ఏర్పాట్లపై కలెక్టర్ సిపి సమీక్ష

గ్రూప్ 1  ప్రిలిమ్స్ పరీక్షలకు ఏర్పాట్లపై కలెక్టర్  సిపి సమీక్ష

ముద్ర  ప్రతినిధి: సిద్దిపేట : గ్రూప్ 1  ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరు అయ్యే అభ్యర్థుల వెంట ఎలక్ట్రానిక్ వస్తువులు, షూస్ లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరాదని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్  అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ పోలీస్ ఆఫ్ కమిషనర్ శ్వేతా తో కలిసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో పాల్గొనే అధికారులు పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించి పరీక్ష నిర్వహణ పై తగు ఆదేశాలు జాతి చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ ఆదివారం నాడు గ్రూప్ 1 పరీక్ష జరగనుందని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తగా టిఎస్పిఎస్సి నిబంధనలకు అనుగుణంగా పరీక్షను నిర్వహించాలని అన్నారు.

సిద్దిపేట పట్టణంలో 20 పరీక్ష కేంద్రాలలో 7786 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని ప్రతి ఒక్క అభ్యర్థి ప్రశాంతంగా పరీక్ష రాసేలా చూడాలన్నారు అభ్యర్థులను ఉదయం  8 గంటల నుండి పరీక్ష కేంద్రాల్లోకి పూర్తిగా తనిఖీ చేసి అనుమతించాలని 10:15 నిమిషాలకు పరీక్ష కేంద్రం గేట్లను మూసివేసి పరీక్ష కేంద్రంలోకి ఎవరిని అనుమతించరాదని పోలీస్ అధికారులకు సూచించారు. హాల్ టికెట్ల మీద ఫోటో ప్రింట్ కానీ అభ్యర్థులు మూడు పాస్పోర్ట్ సైజు ఫోటోలను వెంట తీసుకొని హాల్ టికెట్ పై సెల్ఫ్ అటిస్ట్రేషన్ మరియు గుర్తింపు కార్డుతో వస్తే పరీక్ష రాసేందుకు అనుమతించాలని అన్నారు. విజువల్లి హ్యాండ్ క్యాప్డ్ అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు స్క్రైబులను ఏర్పాటు చేసి 50 నిమిషాలు అదనంగా సమయం కేటాయించాలని అన్నారు.

పోలీస్ మిషనర్  శ్వేత మాట్లాడుతూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను పగడ్బందీగా  నిర్వహించేందుకు ప్రతి పరీక్ష కేంద్రంలో ముగ్గురు లేదా నలుగురు మహిళ పోలీస్ సిబ్బందిని నియమించుకొని పరీక్షను రాసే పురుష మరియు మహిళా అభ్యర్థులను వేరువేరుగా జాగ్రత్తగా చెకింగ్ చేసే పరీక్ష కేంద్రంలోకి పంపించాలని, ఒకరోజు ముందే పోలీస్ సిబ్బంది పరీక్ష కేంద్రంలో పార్కింగ్, చెకింగ్, తదితర ఏర్పాట్లను చూసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి మహేందర్, ఏసీపీలు, సిఐలు, ప్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, లైసెనింగ్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటిండెంట్లు, కలెక్టరేట్ ఏవో, టీఎస్పీఎస్సి ప్రతినిధి బృందం పాల్గొన్నారు.