దళిత సంఘాల ఆధ్వర్యంలో

దళిత సంఘాల ఆధ్వర్యంలో

కెసిఆర్, హరీష్ రావు చిత్రపటాలకు  పాలాభిషేకం

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: సిద్దిపేటలోని దళిత సంఘాల నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర మంత్రి హరీష్ రావుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సిద్దిపేటలోని బీజేఆర్ చౌరస్తా లో ఉన్న పాత కలెక్టరేట్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. డాక్టర్  బి.ఆర్ అంబేద్కర్ భవనాన్ని రాష్ట్ర ఏర్పాటు అయ్యాక కలెక్టరేట్ గా మార్చింది సమీపంలో కొత్త కలెక్టరేట్ భవనం నిర్మించాక ఈ భవనం తిరిగి దళిత సంఘాలకు ప్రభుత్వం అప్పగించింది. భవనానికి ఆదాయం కూర్చోవడానికి షెటర్ల నిర్మాణం, విస్తరణ పనులు చేసుకోవడానికి అంబేద్కర్ జయంతి రోజున మంత్రి హరీష్ రావు కోటి రూపాయల నిధులు మంజూరు చేయడంతో శనివారం నాడు దళిత సంఘాల నాయకులు  కేసీఆర్, హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు సాకి ఆనంద్, గ్యాదరి రవీందర్,  మాల ఉద్యోగుల సంఘo అద్యక్షులు గ్యదరి రామస్వామి, మాల సదర్ సంగం అద్యక్షులు తండ భూమయ్య, కుల సంఘ నేత గ్యాధరి మహంకాళి , బారాస నేతలు బత్తుల శ్రీనివాస్,గ్యదరి భుమలింగం,జక్కుల రాజు, కుల సంగ సభ్యులు గ్యాదరీ కనక మల్లయ్య, మెర్గు వెంకట్, సాకి మల్లేశం, చెట్లపల్లీ బాలకిషన్,ఎర్ర సురేందర్, గుజ్జరి శ్రీనివాస్, యువత నాయకులు దువ్వల శ్రీహరి, పర్శీ, చైతూ, సందీప్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.