3 కోట్లు వ్యయం తో బ్రిడ్జి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

3 కోట్లు వ్యయం తో బ్రిడ్జి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: నీలహళ్లి, పాతపాలెం లో వాగు దగ్గర బ్రిడ్జ్ నిర్మాణం  భూమి పూజ చేసిన పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఈరోజు గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని నీలహళ్లి, కె.టి మండలం పాతపాలెం వాగు దగ్గర నూతన నిర్మాణం బ్రిడ్జిని 3 కోట్లు వ్యయం తో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. (శంకుస్థాపన) పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగినది. ఎమ్మెల్యే. అధికారులు గ్రామ సర్పంచ్ శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ...

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వాగు దగ్గర  బ్రిడ్జి నిర్మాణం సాధ్యం కాలేదు గతంలో వర్షాలు వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవారు ఈ ఊరు నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి రైతులకు పొలాల పనికి వెళ్లే వారికి వర్షాకాలంలో వాగు నుండి రాకపోకలు ఇబ్బందులను ఎదుర్కొనేవారు రైతులు గ్రామస్తులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే. దృష్టికి తీసుకురావడం జరిగింది బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగినది. ఎమ్మెల్యే. సానుకులంగా స్పందించి సీఎం కెసిఆర్. దృష్టికి తీసుకెళ్లి  మూడు కోట్లు తో బ్రిడ్జి నిర్మాణం చేయాలని ప్రతిపాదన చేయడం జరిగింది వెంటనే స్థానికుడంగా కేసీఆర్. సంబంధిత అధికారులకు ద్వారా నిధులను కేటాయించడం జరిగింది. నేడు తెలంగాణ రాష్ట్రంలో  అన్ని ప్రాజెక్టులు పనులు కొనసాగుతున్నాయి అదేవిధంగా ఎక్కడెక్కడ అవసరాన్ని బట్టి బ్రిడ్జి నిర్మాణంలో కూడా ప్రభుత్వం ప్రజలకు సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేయడం జరుగుతుందని.

ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఈ ప్రాంతం నుండి ప్రజలు కర్ణాటక కు వెళ్లడానికి సులభంగా ఉంటుంది అదేవిధంగా రైతులు పొలాల పనికి వెళ్లడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలిపారు. త్వరలో మూడు నెలల్లో వర్షాకాలం రాబోతున్నది కాబట్టి దృష్టిలో ఉంచుకొని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులు బ్రిడ్జి నిర్మాణం పనులు త్వరగా పూర్తిచేసి ప్రజల్లోకి అందుబాటులో తీసుకురావాలని కోరారు. బ్రిడ్జి నిర్మాణం పనులు జరిగేటప్పుడు ప్రజలు అధికారులకు సహకరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపిలు నజూమున్నీసా బేగం, మనోరమ్మ జడ్పిటిసి లు పద్మ వెంకటేశ్వర్ రెడ్డి, రాజశేఖర్, వైస్ ఎంపీపీలు సుదర్శన్ రెడ్డి, రామకృష్ణ నాయుడు, రైతు బంధు సమితి అధ్యక్షుడు హనుమంతు, కె.టి దొడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ఉరుకుందు, కె.టి దొడ్డి మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, సర్పంచ్ సూర్యప్రకాష్ ,  బిఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్ నాయుడు చక్రధర్ రావు, వెంకన్న గౌడ్, సత్య రెడ్డి, నవీన్ రెడ్డి,రాజేష్, శేఖర్, యుగేందర్ గౌడ్, కృష్ణ, శేఖర్, ఆంజనేయులు, జానా, శేఖర్ రెడ్డి, అధికారులు, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.