బోనాల పండుగకు గజ్వేల్ కి రావాలని మంత్రి, ఎంపీలకు ఆహ్వానం

బోనాల పండుగకు గజ్వేల్ కి రావాలని మంత్రి, ఎంపీలకు ఆహ్వానం

ముద్ర ప్రతినిధి:సిద్దిపేట గజ్వేల్ లో ఆదివారం నుంచి జరిగే మహంకాళమ్మ తల్లి బోనాల పండుగకు రావాలని రాష్ట్ర మంత్రి హరీష్ రావు,ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డిలను గజ్వేల్ నేతలు ఆహ్వానించారు. శనివారం నాడు హైదరాబాదులోని మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసాలకు వెళ్లి ఆలయ ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఆహ్వాన పత్రికను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అందజేసిన గజ్వేల్ ప్రేజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళివారి వెంట కౌన్సిలర్ బొల్లిపల్లి బాలమణి శ్రీనివాస్ రెడ్డి, ఆలయం కమిటీ సభ్యులు తలకొక్కుల దుర్గాప్రసాద్, దేవలపల్లి రాజారాం తదితరులు ఉన్నారు.