గజ్వెల్ కేసులలో పారదర్శకంగా నిష్పక్షపాతంగా పరిశోధన

గజ్వెల్ కేసులలో పారదర్శకంగా నిష్పక్షపాతంగా పరిశోధన

సాక్షాలను సేకరించి నిందితులను అరెస్టు చేస్తాం - పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: రెండు మూడు రోజుల క్రితం గజ్వేల్ పట్టణంలో జరిగిన సంఘటనల విషయంలో ఇప్పటి వరకు 8 కేసులు నమోదు చేయడం జరిగిందనిసిద్దిపేట పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు.  కేసుల పరిశోధన త్వరితగతిన చేయడానికి, ప్రతి ఒక్క కేసుకు  పరిశోధన అధికారిని సపరేట్గా నియమించినట్లు తెలిపారు. నిందితుల గురించి స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేసులలో  పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పరిశోధన జరుగుతుందని, టెక్నాలజీ ద్వారా,సీసీ కెమెరాలు ద్వారా  కేసులలో ఎవిడెన్స్ సేకరించి నిందితులను గుర్తించి వెనువెంటనే అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు. గజ్వేల్ పట్టణంలో ప్రశాంతమైన వాతావరణం లో ప్రజలు వారి దయనందిన  కార్యక్రమాలు నిర్వహించు కుంటున్నారని ఆమె తెలిపారు.శాంతి భద్రతల విషయంలో  రాజీ పడే ప్రసక్తే లేదని, కేసులలో ఉన్న నిందితులను ఎంతటి వారైనా వదిలిపెట్టి సమస్య లేదని తప్పకుండా అరెస్టు చేయడం జరుగుతుందని కమిషనర్ స్పష్టం చేశారు.

గజ్వేల్ పట్టణము పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 500 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు పై కేసులలో ఉన్న 17 మంది నిందితులను గుర్తించి అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించడం జరిగిందనితెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే షికార్లు,పుకార్లు నమ్మవద్దని రెండు మూడు రోజుల క్రితం జరిగిన సంఘటనను ఈ రోజే జరిగినట్లు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లలో పోస్ట్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు