కేఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ

కేఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ

సిద్ధిపేట: ముద్ర ప్రతినిధి: కల్వకుంట్ల రంగారావు( కె ఆర్ ఆర్) ఫౌండేషన్ ద్వారా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సిద్దిపేటలోని రైతు బజార్ పక్కన గల కాంప్లెక్స్ లో 
మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని  కల్వకుంట్ల  రంగారావు ఫౌండేషన్ చైర్మన్ కల్వకుంట్ల వంశీధర్ రావు శుక్రవారం ప్రారంభించారు.ఈ కుట్టు శిక్షణ శిబిరంలో పాల్గొని స్వయం ఉపాధి పొందడానికి ఎంతోమంది మహిళలు తమ దరఖాస్తులను వంశీధర్రావుకు అందజేశారు.
అనంతరం వంశీధర్ రావు మాట్లాడుతూ ఈ కుట్టు శిక్షణ కార్యక్రమం ఉదయం,మధ్యాహ్నం రెండు బ్యాచ్ ల వారీగా 45 రోజుల నుండి 60 రోజులు నిరంతరాయంగా నిర్వహిస్తామని తెలిపారు.శిక్షణ కాలం ముగిశాక సర్టిఫికెట్ కూడా అందజేస్తామని తెలిపారు. శిక్షణ శిబిరాన్ని నిరుద్యోగ యువతులు,మహిళలు సద్వినియోగం చేసుకొని,స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని కోరారు.ఈ ఫౌండేషన్ తరపున తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, భవిష్యత్తులో కూడా ఇదే రకంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ నిరంతరం ప్రజలతో మమేకమై జీవిస్తానని అన్నారు.తన కార్యక్రమాలకు సహకరిస్తున్న
 తన మిత్ర బృందానికి,పట్టణ ప్రజలకు,వివిధ పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ మల్యాల బాలరాజు,నర్సాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ లింగం,ఇఫ్తాకర్,కొండ రాజ్ కుమార్,సజ్జు,సురేందర్ గౌడ్,ఎజాజ్ పటేల్,యూసుఫ్,ఖధీర్,శ్రీనివాస్ గౌడ్,చిన్న,అశోక్,వెంకట్,వేణు, దయాకర్ చారి,గ్యాదరి గిరి, మహేందర్,సూరి,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.