పోగొట్టుకున్న మొబైల్ ను బాధితుడికి అప్పగించిన టూ టౌన్ ఇన్స్పెక్టర్ రవికుమార్ 

పోగొట్టుకున్న మొబైల్ ను బాధితుడికి అప్పగించిన టూ టౌన్ ఇన్స్పెక్టర్ రవికుమార్ 

సిద్దిపేట, ముద్ర ప్రతి నిధి : బాధితుడు పోగొట్టుకున్న మొబైల్ ను స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తికి పోలీసులు అందజేశారు. సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందపల్లి గ్రామానికి చెందిన ఎంటి కనకయ్య15 రోజుల క్రితం తన ఫోన్ పోగొట్టుకున్నాడు. సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన  వెబ్సైట్లో ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ను ఎంటర్ చేసిబ్లాక్ చేయడంతో  ఫోన్ దొరికిన వ్యక్తి వివరాలు సేకరించి అతని నుంచి ఫోన్ను స్వాధీనం చేసు కున్నారు . సోమవారం నాడు బాధితుడు కనకయ్య అని పిలిచి ఫోన్ అంద చేసినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారుఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రవికుమార్,  మాట్లాడుతూ ఎవరైతే ఫోన్ పోగొట్టుకుంటే, గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనంగా ఎత్తుకొని పోయిన వారు వెంటనే కేంద్ర  ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన  సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్  లో పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని,తద్వారా  కోల్పోయిన ఫోన్ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మరియు ఎవరన్నా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మితే కొనవద్దని సూచించారు.