నెలాఖరులోగా మన ఊరు మనబడి పనులన్నీ పూర్తి కావాలి

నెలాఖరులోగా మన ఊరు మనబడి పనులన్నీ పూర్తి కావాలి

అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం

సిద్దిపేట : ముద్ర ప్రతి నిధి ఈ నెల చివరి వరకు 'మన ఊరు మన బడి' పథకంలో చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో సిద్దిపేట నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథకంలో కేటాయించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎమ్ సి చైర్మన్ లు, ఎంఈవోలు, ఎంపిడిఒ లు.ఎంపిఓలు , ఇంజనీరింగ్ విభాగం ఈఈ, డిఈ, ఎఈ నిర్మాణ ఎజెన్సీ, సర్పంచ్ లు అందరితో పాలనాధికారి మండలాల్లో పాఠశాలల వారిగా సమీక్ష సమావేశం నిర్వహించారు. 

కలెక్టర్ మాట్లాడుతూ   మన ఊరు మన బడి పథక పాఠశాలను మే నెల చివర వరకు పనులు పూర్తి చేయ్యాలని మంత్రి హరీష్ రావు ఆదేశించినందున, అదే లక్ష్యంతో అధికారులు పని చేయ్యాలని సూచించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఒ చంద్రమోహన్ రెడ్డి, డిఇఓ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్, సిద్దిపేట మునిసిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.