పంచాయితీ కార్యదర్శుల సమ్మెకు మద్దతుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ సంఘీభావం:

పంచాయితీ కార్యదర్శుల సమ్మెకు మద్దతుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ సంఘీభావం:

ముద్ర సిరిసిల్ల టౌన్; రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయితీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత 12 రోజులుగా పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నప్పటికిని ప్రభుత్వ విధానంలో చలనం లేకుండా పోయింది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9500 మంది కార్యదర్శులు సమ్మెలో పాల్గొంటున్నారు అని, కార్యదర్శులు ఏ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది అన్నారు. హక్కులను విన్నవించుకుంటే సరిపోదు పోరాడి సాధించుకోవాలని తెలిపారు. విధుల్లోకి రాకపోతే తొలగిస్తామంటున్న ప్రభుత్వం, ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా నియమించబడిన కార్యదర్శులను తొలగించే అవకాశం లేదు అని గుర్తించాలని చెప్పారు.

తెలంగాణ వస్తే తమ బ్రతుకులు బాగా పడుతాయి అనుకున్న నిరుద్యోగులు బంగారు తెలంగాణలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కెసిఆర్ ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదు అన్నారు. 40 మంది కార్యదర్శులు చనిపోతే కారుణ్య నియామకాలు ఇప్పటి వరకు చేయలేదు అని, తొమ్మిది సంవత్సరాలుగా ప్రశ్నించే గొంతులను ఈ నియంత ప్రభుత్వం అణిచి వేస్తుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు, పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, టిపిసిసి సభ్యులు నాగుల సత్యనారాయణ,ఎస్ సి సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.