పాక్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​కు బెయిల్

పాక్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​కు బెయిల్

పాక్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​కు బెయిల్​ మంజూరైంది. 2 వారాల మధ్యంతర బెయిల్​ను ఇస్లామాబాద్​  హైకోర్టు ఇచ్చింది.  షరతులతో కూడిన బెయిల్​  మంజూరు చేసింది.  భూకబ్జా కేసులో ఇమ్రాన్​కు బెయిల్​ మంజూరైంది. ఆయనపై 10కి పైగా అరెస్టు వారెంట్లు ఉన్నాయి.  అల్​ ఖాదరీ ట్రస్టు కేసులో బెయిల్​ లభించింది. ఇమ్రాన్​ ఖాన్​ కోర్టుకు వచ్చే సమయంలో హైడ్రామా నడిచింది. భారీ భద్రత మధ్య ఆయన హైకోర్టుకు వచ్చారు. హైకోర్టు బయట ఆర్మీ బలగాలు, పంజాబ్​ పోలీసులు మోహరించారు. ఇమ్రాన్​ మద్దతుదారులు హైకోర్టు దగ్గరకు భారీగా తరలివచ్చారు. ఆయనకు మద్దతుగా పీటీఐ కార్యకర్తలు నినాదాలు చేశారు.