పాక్​ మాజీ ప్రధానిపై విమర్శల వర్షం

పాక్​ మాజీ ప్రధానిపై విమర్శల వర్షం

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హోలీ సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు, అయితే ఈ సందేశంతో షరీఫ్ చేసిన పనికి ట్విట్టర్ వినియోగదారులు అతన్ని విపరీతంగా ట్రోల్  చేస్తున్నారు.  నవాజ్ షరీఫ్ గతంలో భారత్‌తో సంబంధాలను మెరుగుపరచడంలో పేరుగాంచారు. షరీఫ్ ప్రస్తుతం లండన్‌లో ఉంటూ అనారోగ్యానికి చికిత్స పొందుతున్నారు, షరీఫ్ భారతీయులకు హోలీ శుభాకాంక్షలు తెలిపే వరకు అంతా బాగానే ఉన్నా, దానికి దీపావళిని ప్రతిబింబించే ఇమోజీ షేర్ చేశారు.  ఇది చూసిన సోషల్ మీడియా యూజర్స్ నవాజ్ షరీఫ్‌ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ట్రోలర్లు హోలీ, దీపావళి పండుగల మధ్య తేడాను అర్థం చేసుకోవాలని షరీఫ్‌కు సూచించారు. 1,097 మందికి పైగా నెటిజన్లు రీట్వీట్ చేశారు. ఒక యూజర్.. 'దీపం అనేది దీపావళికి చిహ్నం.. హోలీకి కాదు' అని పేర్కొన్నారు. మరొక యూజర్.. దీపం అనేక రంగులలో (హోలీ) వెలిగిపోతుందని రాశారు.   నవాజ్ షరీఫ్ మరో విషయంలోనూ ట్రోలర్స్ బారిన పడ్డారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పాకిస్తాన్  పొరుగు దేశాల సాయం కోసం ఎదురు చూస్తోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ షరీఫ్ విలాసవంతమైన జీవితం గడపడానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో షరీఫ్ రోల్స్ రాయిస్ కారులో లండన్‌లోని లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ దుకాణానికి చేరుకోవడం కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో కనిపించగానే నెటిజన్లు ట్విట్టర్‌లో షరీఫ్‌ను విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇమ్రాన్ ఖాన్‌కి చెందిన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నేతలతో పాటు ట్విట్టర్ యూజర్స్ మాజీ ప్రధాని పర్యటనపై పండిపడ్డారు.