గంట గంటకు పెరుగుతున్న టర్కీ భూకంప మృతుల సంఖ్య | Mudra News

గంట గంటకు పెరుగుతున్న టర్కీ భూకంప మృతుల సంఖ్య | Mudra News
  • 20వేల మంది మృతి.. 40వేల మందికి గాయాలు
  • సహాయక చర్యల్లో పుంజుకున్న వేగం..
  • అడక్కుండానే సహాయం చేస్తున్న భారత్​సేవలను కొనియాడిన టర్కీ రాయబారి
  • పర్యటనకు వస్తానన్న పాక్​ ప్రధానికి అధ్యక్షుడి మొట్టికాయలు!


న్యూఢిల్లీ: టర్కీలో మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. సహాయక చర్యల్లో వేగం పెరగడంతో టర్కీ, సిరియాల్లోని కూలిన భవంతుల కింద మృతశరీరాలు భారీగా లభ్యమవుతున్నాయి. ఇప్పటివరకూ 20వేల మంది చనిపోయినట్లు 40వేల మందికి గాయాలైనట్లు అధికారిక సమాచారం. నేడు కూడా రిక్టర్​స్కేల్​పై భూకంప తీవ్ర స్వల్పంగా నమోదైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. రోడ్డుపై పగుళ్ళు ఏర్పడుతుండడంతో మళ్ళీ తీవ్ర భూకంపం చోటు చేసుకుంటుందేమోనని ప్రజలు తీవ్ర భయాందోళనలు చెంది నిర్మాణుష్య ప్రాంతాల్లోకి పరుగులు తీశారు. కూలిన ఇళ్ళ వద్ద కొద్దిదూరంలోనే ప్రభుత్వం ఇచ్చిన టెంట్లలో భూకంప బాధితులు ప్రస్తుతం ఆవాసం పొందుతున్నారు.


మరోవైపు సహాయక చర్యల్లో వేగం పెరిగింది. టర్కీ రెస్క్యూ బృందాలే కాకుండా ప్రపంచదేశాల నుండి వస్తున్న సహాయం వల్ల టర్కీ ఎయిర్​పోర్ట్​ బిజీగా మారింది. ఆయా దేశాల రెస్క్యూ బృందాలు, విమానాలు, సరుకులు, మందులు, టెంట్లు, అన్నపానీయాలు, ఆర్మీ, శునకాలు ఇలా అంతా ఒకేసారి రంగంలోకి దిగడంతో ఓ వైపు సహాయక చర్యలు మరోవైపు పునరావాస చర్యల్లో వేగం పుంజుకుంది. శిథిలాల తొలగింపులో కూడా వేగం పెంచడంతో శిథిలాల కింద మృతశరీరాలు భారీగా బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. చలి, వర్షం సహాయక చర్యల్లో అడ్డంకిగా మారుతుండడంతో పలుదేశాలు ఇప్పటికే ప్లాస్టిక్​ టెంట్లు, వాటర్​ఫ్రూఫ్​ జాకెట్లను బాధితులకు అందించారు. అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్​, జర్మనీ ఇలా అన్ని దేశాల నుంచి సుమారు 50 విమానాల్లో టర్కీకి సహాయ బృందాలు, సహాయ సామాగ్రి చేరుకున్నాయి.


భారత్​ సహాయం..
భూకంపం వచ్చిన వెంటనే మోఢీ సంతాపం వ్యక్తం చేస్తుండగానే మరోవైపు భారత్​ నుండి సహాయక చర్యల సామాగ్రితో సీ–17 టర్కీకి వెళ్ళింది. అనంతరం గురువారం వరకూ భారత్​ నుండి 6 విమానాలు సహాయ సామాగ్రిని తీసుకొని వెళ్ళాయి. మరిన్ని విమానాలు సిద్ధంగా ఉన్నాయి. సహాయక చర్యల్లో వేగం పెంచడంతో టర్కీ ప్రభుత్వం, విదేశాంగ మంత్రి, టర్కీ రాయబారి భారత్​చేస్తున్న సహాయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. భారత్​ చేస్తున్న ఈ సహాయాన్ని మరువలేమన్నారు. భవిష్యత్​లో ఈ విషయాన్ని గుర్తుంచుకుంటామని టర్కీ రాయబారి ప్రకటించడం గమనార్హం. 


పాక్​కు మొట్టికాయలు..
మరోవైపు టర్కీలో పర్యటించనున్న పాక్​ ప్రధాని షానవాజ్​ షరీఫ్​టర్కీకి రావద్దని అధ్యక్షుడు ఎర్డోగన్​ తేల్చి చెప్పినట్లు సమాచారం. అసలు దుం:ఖంలో ఉన్న ఇలాంటి సమయంలో పర్యటించవద్దని ఖరాఖండిగా చెప్పారని స్థానిక మీడియా సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఆపన్నహస్తం అందించకుండా పర్యటనలు, సమావేశాలు ఏంటని ఎర్డోగన్​ గట్టిగానే షానవాజ్​ను నిలదీశారని చెబుతున్నారు.