ఉమ్మడి ఏపీలోని  ఆస్తుల విభజనపై సుప్రీం కోర్టులో విచారణ 

ఉమ్మడి ఏపీలోని  ఆస్తుల విభజనపై సుప్రీం కోర్టులో విచారణ 

ఉమ్మడి ఏపీలోని  ఆస్తుల విభజనపై ఏపీ ప్రభుత్వం  దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఏపీ పిటిషన్​పై రిప్లయ్​ దాఖలుకు తెలంగాణకు, కేంద్రానికి సుప్రీం కోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. షెడ్యూలు 9, 10లో ఉన్న 1.4 లక్షల కోట్ల ఆస్తుల విభజన ఇంకా జరగలేదని ఏపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేంద్రానికి, తెలంగాణకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. సుప్రీం నోటీసులకు ఇంకా స్పందించని తెలంగాణ, కేంద్రం. దీంతో మరో 4 వారాల గడువు ఇచ్చింది. ఆస్తుల విభజనకు రిటైర్డ్​ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలన్న ఏపీ అభ్యర్థనను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు చెప్పింది.