గ్రామాల్లో చెక్కర్లు కొడుతున్న జెట్ విమానం

గ్రామాల్లో చెక్కర్లు కొడుతున్న జెట్ విమానం

రేగొండ, ముద్ర:- విమానం ఆకాశంలో వెళ్తోందంటేనే ఆశ్చర్యంగా చూస్తాం... ఇక మన ఊరికి హెలికాప్టర్ వచ్చిందంటే ఎవరొచ్చారని ఆరా తీస్తాం.. ఎందుకంటే దగ్గర నుంచి చూడడం చాలామందికి వీలుకాదు. అయితే రేగొండ మండల కేంద్రంలోని గ్రామాల్లో ఓ జెట్​ విమానం  మూడు రోజులుగా చక్కర్లు కొడుతోంది. అది కూడా అతి తక్కువ ఎత్తులో తిరుగుతోంది. దీంతో జనం ఆశ్చర్యంగా చూస్తూ ఆందోళన చెందుతున్నారు. రేగొండ మండలంలోని గ్రామాల్లో ఇళ్లపై నుంచే వెళుతోంది.

దీంతో అసలు ఈ విమానం ఎందుకు తిరుగుతోందని రేగొండ మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కొందరు ఆందోళన చెందుతూ అసలే పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జెట్ విమానం గ్రామాల్లో అతి తక్కువ ఎత్తులో తిరగడం అనుమానాలకు తావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ సర్వేకు ఎవరైనా వస్తున్నారా, లేదంటే ఎన్నికల వేళ మావోయిస్టులపై నిఘా పెడుతున్నారా అని గ్రామాల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం డ్యామేజీపై సర్వే చేస్తుందా, ఇటీవలే సర్వే పూర్తి చేసి అధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో జెట్ ఇక్కడ చెక్కర్లు కొట్టడంతో దానిని కేంద్ర ప్రభుత్వం పంపించి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కొందరు ఈ జెట్ విమానాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు.