ఆపదలో ఉన్నవ్యక్తికి అండగా జేడీ!

ఆపదలో ఉన్నవ్యక్తికి అండగా జేడీ!
  • రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సేవలు

విశాఖపట్నం: విశాఖపట్నం ఊర్వశి జంక్షన్ వద్ద, రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి గాయపడి బాధపడుతున్నాడు. అలా బాధపడుతున్న ఆ వ్యక్తిని  కారులో అటువైపు వెళుతున్న జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, విశాఖ నార్త్ ఎమ్మెల్యే అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ  చూశారు. వెంటనే తన కారును ఆపించి దిగి క్షతగాత్రుడు స్పృహ కోల్పోకుండా సేవలు చేసారు. అంబులెన్స్ ను పిలిపించి ఆసుపత్రికి పంపారు. ఇదంతా గమనించిన స్థానికులు మానవత్వం పరిమళించిన మంచి మనిషి జేడీ లక్ష్మీనారాయణ అని కొనియాడారు.