తండ్రి వర్సెస్‌ తండ్రి.. కొడుకు వర్సెస్‌ కొడుకు..

తండ్రి వర్సెస్‌ తండ్రి.. కొడుకు వర్సెస్‌ కొడుకు..

నారా` పెద్దిరెడ్డి.. ఆ రెండు కుటుంబాలకున్న రాజకీయ వైరం ఈనాటిది కాదు. చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరూ రాజకీయాల్లో సమకాలికులు. విద్యార్ధి రాజకీయాల నాటి నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. యూనివర్శిటీలో స్టూడెంట్‌ డేస్‌ నుంచి ప్రస్తుత పొలిటికల్‌ లీడర్స్‌ వరకూ.. సేమ్‌ వార్‌ నాన్‌ స్టాప్‌ గా కంటిన్యూ అవుతూనే ఉంది.దాదాపు ఐదు దశబ్ధాల పాటు వీరిద్దరి మధ్య నడుస్తోన్న రాజకీయ యుద్ధం ఇటు జిల్లా రాజకీయాల్లోనే కాదు అటు స్టేట్‌ పాలిటిక్స్‌ లోనూ వాడీ వేడీ చర్చనీయాంశమే. వర్సిటీ లెవల్లో పెద్దిరెడ్డిది పైచేయి కాగా.. రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు సీఎంగా చక్రం తిప్పడంతో డామినేట్‌ చేయగలిగారు. ఇప్పటికీ ఈ ఇద్దరి మధ్య ఆ కాక.. నువ్వా` నేనా అన్నట్టుగా కొనసాగుతూనే ఉంది. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు పెద్దిరెడ్డి మధ్య ముగిసిందనుకున్న రాజకీయ యుద్ధం మరింత వేడెక్కింది. కుప్పం నుంచి చంద్రబాబు` పుంగనూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి.. మధ్య మాటల యుద్ధం మరోమారు పీక్‌ స్టేజ్‌ కి చేరింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరుకుంది.నలభై ఏళ్లుగా బాబు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పంపై పెద్దిరెడ్డి స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. అంతే కాదు.. లోకల్‌ బాడీ ఎలెక్షన్స్‌లో చంద్రబాబుపై పెద్దిరెడ్డిది అప్పర్‌ హ్యాండ్‌ అయ్యింది కూడా. దీంతో పెద్దిరెడ్డిని తన ఫస్ట్‌ టార్గెట్‌గా ఫిక్స్‌ చేశారు చంద్రబాబు. పెద్దిరెడ్డి తన కంచుకోట కుప్పంలో పై చేయి సాధిస్తుండటంతో చంద్రబాబు.. ఈ నియోజకవర్గంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. దీంతో ఈ చిరకాల ప్రత్యర్ధుల మధ్య తిరిగి అగ్గిరాజుకుంది.చంద్రబాబు వరుసగా కుప్పం పర్యటనలు చేయడంతో పాటు.. పుంగనూరు విూద కూడా భారీగానే దృష్టి సారించారు. దీంతోనే బాబు పర్యటనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. దాడులు` కేసులు` అరెస్టులు కొనసాగడంతో మరోమారు వీరిద్దరి మధ్య అలనాటి హీటెడ్‌ పాలిటిక్స్‌ తిరిగి స్టార్టయ్యాయి. మరోవైపు పుంగనూరులో టీడీపీ కేడర్‌ పై దాడులు` కేసులు నమోదు కావడంతో చంద్రబాబు సైతం పెద్దిరెడ్డిపై డైరెక్ట్‌ అటాక్‌ చేయడం స్టార్ట్‌ చేశారు.

సంక్రాంతి పండగకు సొంత జిల్లాకు వచ్చిన చంద్రబాబు.. పెద్దిరెడ్డే ప్రధాన లక్ష్యంగా వరుసగా మూడు రోజుల పాటు.. హెచ్చరికలు జారీ చేశారు. పెద్దిరెడ్డిని డైరెక్ట్‌ అటాక్‌ చేయడంలో భాగంగా ఈసారికి పుంగనూరు పుడిరగి ఎలా గెలుస్తాడో చూస్తానంటూ ఛాలెంజ్‌ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య పొలిటికల్‌ వార్‌.. సెవిూ క్లైమ్యాక్స్‌ కి చేరినట్టయ్యింది. సరిగ్గా ఇదే సమయంలో పెద్దిరెడ్డి కూడా చంద్రబాబుకు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. అధికారంలో ఉన్నపుడే ఏవిూ చేయలేక పోయిన బాబు.. ఇప్పుడేం చేయగలరని ఎద్దేవా చేశారు. కుప్పంలో ఈసారి డిపాజిట్‌ రావడం కష్టమని.. నేరుగా ఆయనపై పోటీకి సైతం తాను సై అన్నారు. సీఎం జగన్‌ ఆదేశిస్తే.. ఇటు కుప్పంలో అయినా, అటు పుంగనూరులో అయినా చంద్రబాబుపై పోటీ చేయడానికి సిద్ధమేనని అన్నారు. ఆల్రెడీ కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబుకు గట్టి షాకివ్వగలిగిన తాము.. ఈసారికి ఇక్కడ జెండా పీకేయడం ఖాయమని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.ఇక పెద్దిరెడ్డికి ఉన్న దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరో సవాల్‌ విసిరారు. పుంగనూరులో అయినా, కుప్పంలో అయినా పెద్దిరెడ్డితో తలపడే ధైర్యం బాబుకు ఉంటే సిద్ధం కావాలంటూ నారాయణస్వామి విసిరిన ఛాలెంజ్‌ చిత్తూరు పొలిటికల్‌ సర్కిల్స్‌ లో మరింత హీటు పెంచింది.ఇద్దరు పెద్ద తలకాయల మధ్య రాజకీయ రణభేరి ఈ స్థాయిలో సాగుతోంటే.. వారి వారసుల మధ్య కూడా ఢీ అంటే ఢీ అనే వాతావరణమే కనిపిస్తోంది. లోకేష్‌ బాబు పాదయాత్ర విూద విూ అభిప్రాయమేంటని పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్‌ రెడ్డిని అడగ్గా.. లోకేష్‌ మాత్రమే కాదు కేఏపాల్‌, పవన్‌ సహా ఎవరైనా సరే రాష్ట్రంలో యాత్రలు చేసుకోవచ్చనీ. అయితే లోకేష్‌ కూడా.. తన తండ్రిలా ఫ్రస్టేషన్‌ కొద్దీ అదుపు తప్పి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని గట్టి హెచ్చరికలే జారీ చేశారు మిధున్‌ రెడ్డి.అంటే తరతరాల పెద్దిరెడ్డి` నారా కుటుంబాల రాజకీయ పోరాటంలో వారసులు కూడా తగ్గేదే లేదంటున్నారన్నమాట. మరి చూడాలి. తండ్రులే కాకుండా కొడుకుల మధ్య ఈ మాటల యుద్ధం ఇంకెంత పదునెక్కుతుందో.. అని కామెంట్‌ చేస్తున్నారు జిల్లా రాజకీయ రంగాల వారు.